సొంత ఊరిలో…బాల్య స్నేహితులతో

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈరోజు తన సొంత ఊరు అయిన చింతమడకలో పర్యటిస్తున్నారు. చింతమడక చేరుకున్న కేసీఆర్ తన బాల్య స్నేహితులతో కాసేపు ముచ్చటించారు. గ్రామస్థుల [more]

Update: 2019-07-22 08:10 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈరోజు తన సొంత ఊరు అయిన చింతమడకలో పర్యటిస్తున్నారు. చింతమడక చేరుకున్న కేసీఆర్ తన బాల్య స్నేహితులతో కాసేపు ముచ్చటించారు. గ్రామస్థుల నుంచి వినతులను తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ చింతమడకలో సమస్యలన్నీ తీర్చే బాధ్యత తనపై ఉందన్నారు. తనకు ప్రాణం ఇచ్చిన ఊరుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. కాళేశ్వరం నీరు కూడా చింతమడకకు చేరుకుంటుందన్నారు. మూడు నెలల్లో చింతమడక స్వరూపాన్నే మార్చేస్తానని చెప్పారు. చింతమడకలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. చింతమడకలో ఎవరికి అనారోగ్యం వచ్చినా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.

Tags:    

Similar News