తొలి బీఆర్ఎస్ సభ... వన్డే మ్యాచ్ ఎఫెక్ట్

రేపు ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ సభకు టీం ఇండియా వన్డే సభ పెద్ద ఆటంకంగా మారనుంది.

Update: 2023-01-17 06:49 GMT

ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ సభకు టీం ఇండియా వన్డే సభ పెద్ద ఆటంకంగా మారనుంది. రేపటి రోజు న్యూజిలాండ్ తో భారత్ వన్డే మ్యాచ్ జరుగుతుండటంతో ఎక్కువ మంది క్రికెట్ వైపు చూస్తారని అంచనాలు వినపడుతున్నాయి. తెలంగాణలో ఎక్కువ మంది క్రికెట్ అభిమానులున్నారు. ప్రధానంగా యువత క్రికెట్ వైపు మొగ్గు చూపుతారు. వన్డే మ్యాచ్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుండటంతో ఎక్కువ మంది దానికే ప్రాధాన్యత ఇస్తారు.

మధ్యాహ్నం 1.30 నుంచి...
వన్డే మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. బీఆర్ఎస్ ఖమ్మం సభ కూడా అదే సమయంలో ప్రారంభయ్యే అవకాశాలున్నాయి. రాత్రి 10 గంటల వరకూ మ్యాచ్ ఉండే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్ లు ఈరోజే హైదరాబాద్ చేరుకుంటారు. రేపు ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలసి యాదాద్రిని సందర్శిస్తారు.
ప్రత్యక్ష ప్రసారాలను...
ఖమ్మంలో సభ మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో ప్రారంభమవుతుంది. నలుగురు ముఖ్యమంత్రుల ప్రసంగాల సమయంలో వన్డే మ్యాచ్ జరుగుతుంటుంది. న్యూస్ ఛానెళ్లు సీఎంల ప్రసంగాలను ప్రత్యక్ష ప్రసారం చేసినా వన్డే మ్యాచ్ చూడటానికే ఎక్కువ మంది ఇష్టపడతారంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా సాగే సీఎంల ప్రసంగాలు ఎక్కువ మంది వినే అవకాశం ఉండదన్న అంచనాలు ఉన్నాయి. అందుకే తొలిసారి ఖమ్మంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభకు వన్డే మ్యాచ్ దెబ్బ కొడుతుందని టీఆర్ఎస్ నేతలే అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News