సుప్రీంలో ఎమ్మెల్సీ అనంతబాబుకు నిరాశ.. బెయిల్ విచారణ డిసెంబర్ 12కు వాయిదా

తన డ్రైవర్ హత్య కేసులో అరెస్టైన అనంతబాబు.. మే 23 నుండి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. అప్పటి నుండి బెయిల్

Update: 2022-11-14 09:51 GMT

mlc anantha babu bail in supreme court

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టైన బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేడు అనంతబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. బెయిల్ పిటిషన్ పై కౌంటర్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ పిటిషన్ పై తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 12కు వాయిదా వేసింది. అనంతబాబు బెయిల్ పిటిషన్ పై విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేయడం గమనార్హం.

తన డ్రైవర్ హత్య కేసులో అరెస్టైన అనంతబాబు.. మే 23 నుండి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. అప్పటి నుండి బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. అనంతబాబుకు బెయిల్ ఇచ్చేందుకు రాజమండ్రి కోర్టుతో పాటు ఏపీ హైకోర్టు ఇదివరకే తిరస్కరించిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా తమ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తండ్రి కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది.



Tags:    

Similar News