బ్రేకింగ్ : తెలంగాణలో 90 వేలు దాటేసిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. తాజాగా 1,863 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 10 మంది మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం [more]

Update: 2020-08-15 03:21 GMT

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. తాజాగా 1,863 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 10 మంది మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,259కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 684 మంది తెలంగాణాలో మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 23,179 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 66,196 గా ఉంది. హైదరాబాద్ లో ఒక్కరోజులో 394 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News