బాబ్రీ పై నేడు తుది తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ
బాబ్రీమసీదు కూల్చివేత కేసులో నేడు ప్రత్యేక న్యాయస్థానం తుదితీర్పు వెలువరించనుంది. 32 మంది నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. 1992లో బాబ్రీ మసీదును కరసేవకులు [more]
బాబ్రీమసీదు కూల్చివేత కేసులో నేడు ప్రత్యేక న్యాయస్థానం తుదితీర్పు వెలువరించనుంది. 32 మంది నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. 1992లో బాబ్రీ మసీదును కరసేవకులు [more]
బాబ్రీమసీదు కూల్చివేత కేసులో నేడు ప్రత్యేక న్యాయస్థానం తుదితీర్పు వెలువరించనుంది. 32 మంది నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. 1992లో బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. ఇందులో మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వాని, మాజీ కేంద్రమంత్రులు మురళి మనోహర్ జోషి, ఉమాభారతి, మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ తదితరులు ఉన్నారు. వీరిలో ఉమాభారతి తనకు ఆరోగ్యం బాగా లేనందున హాజరు కాలేనని చెప్పారు. బాబ్రీమసీదు కేసులో తుదితీర్పు వెలువడనుండటంతో దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.