అమెరికాలో కాల్పులు… హైదరాబాద్ వాసికి తీవ్ర గాయాలు
చికాగోలోలోని ఎస్. మిచిగాన్ ఎవెన్యూ సమీపంలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మొహమ్మద్ ముజుబుద్దీన్ పై దుండుగులు కాల్పులు జరిపారు. ముజుబుద్దీన్ కారులో [more]
చికాగోలోలోని ఎస్. మిచిగాన్ ఎవెన్యూ సమీపంలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మొహమ్మద్ ముజుబుద్దీన్ పై దుండుగులు కాల్పులు జరిపారు. ముజుబుద్దీన్ కారులో [more]
చికాగోలోలోని ఎస్. మిచిగాన్ ఎవెన్యూ సమీపంలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మొహమ్మద్ ముజుబుద్దీన్ పై దుండుగులు కాల్పులు జరిపారు. ముజుబుద్దీన్ కారులో వస్తుండగా తుపాకీ చూపి కారు ఆపారు. కారు దింపి ముజుబుద్దీన్ నుంచి నగదు లాక్కునే ప్రయత్నం చేశారు. దీనిని ముజుబుద్దీన్ అడ్డుకున్నారు. కారును కూడా దుండగులు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ముజుబుద్దీన్ అడ్డుకున్నారు. దీంతో ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ముజుబుద్దీన్ ను యూనివర్సిటీ ఆఫ్ చికాగో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.