బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ నామినేషన్ ను తిరస్కరించండి

తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ నామినేషన్ ను తిరస్కరించాలని రిటర్నింగ్ అధికారికి పలువురు ఫిర్యాదు చేశారు. నామినేషన్ వేసే సమయంలో తనపై ఎలాంటి కేసులు లేవని [more]

Update: 2021-04-01 00:43 GMT

తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ నామినేషన్ ను తిరస్కరించాలని రిటర్నింగ్ అధికారికి పలువురు ఫిర్యాదు చేశారు. నామినేషన్ వేసే సమయంలో తనపై ఎలాంటి కేసులు లేవని రత్న ప్రభ చెప్పారని, అయితే ఆమెపై బంజారాహిల్స్, సైఫాబాద్, హనుమంతుని పాడు పోలీస్ స్టేషన్లలలో అయిదు కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఏవీ రమణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కుల ధృవీకరణ పత్రం కూడా సరిగా లేదని, ఆమె నామినేషన్ ను తిరస్కరించాలని ఆయన రిటర్నింగ్ అధికారిని కోరారు.

Tags:    

Similar News