India vs South Afrcia : చెత్త బౌలింగ్.. ఛండాలమైన బ్యాటింగ్.. భారత్ ఘోర ఓటమి.. ప్రతీకారం తీర్చుకన్నారుగా

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం పాలయింది

Update: 2025-12-12 02:33 GMT

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం పాలయింది. 51 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. కటక్ లో ఘోర ఓటమి తర్వాత దక్షిణాఫ్రికా కసితో మైదానంలోకి దిగి భారత్ ను ఓటమి వైపునకు నెట్టేలా చేసింది. దీంతో భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమంగా ఉంది. తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే భారత బౌలర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్లను అదుపు చేయలేకపోయారు.

భారీ పరుగులు సాధించి...
దీంతో దక్షిణాఫ్రికా భారీగా పరుగులు సాధించింది. డీకాక్ 90 పరుగుల చేశాడు. క్వింటన్ డీకాక్ భారత్ బౌలర్లను చీల్చి చెండాడాడు. కేవలం 46 బంతుల్లోనే 90 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సిక్సర్లు, ఐదు బౌండరీలు ఉన్నాయి. డొనోవన్‌ ఫెరెరా 30 పరుగుల చేసి నాటౌట్‌ గా నిలిచాడు. డేవిడ్‌ మిల్లర్‌ 20 నాటౌట్‌ ఉన్నాడు. ఇరవై ఓవర్ల కు చివరలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు వేగంగా ఆడారు.దీంతో దక్షిణాఫ్రికా భారీ పరుగులు చేసింది. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 213 భారీ పరుగులు చేయడంతో భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచినట్లయింది. అర్షదీప్ సింగ్ ఒక ఓవర్ లో ఏడు పరుగులు వైడ్ వేశాడంటే ఎంతటి నిర్లక్ష్యమో.. ఎంతటి వైఫల్యమో తెలిసిపోతుంది.
బ్యాటింగ్ లో ఘోర వైఫల్యం
ఇక భారత్ బ్యాటింగ్ కు దిగేసరికి భారీలక్ష్యం ముందున్నప్పటికీ ఓపెనర్లు మళ్లీ విఫలమయ్యారు. అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ అట్టర్ ప్లాప్ అయ్యారు. సూర్యకుమార్ యాదవ్ కూడా చేతులెత్తేశాడు. ఇక తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ మాత్రమే నిలకడగా రాణించి ఆ మాత్రం భారత్ పరువు నిలిపాడు. హార్ధిక్ పాండ్యా ఇరవై పరుగులు చేశాడు. 19.2 ఓవర్లలో కేవలం 162 పరుగులు మాత్రమే చేయడంతో యాభై ఒక్క పరుగులు తేడాతో భారత్ ఓటమి పాలయింది. భారత్ బౌలింగ్, బ్యాటింగ్ పరంగా ఘోరంగా వైఫల్యం చెందడంతో భారత్ కు అపజయాన్ని మూటగట్టుకుంది.


Tags:    

Similar News