Weather Report : చలిగాలుల తీవ్రత ఇంకా ఎన్ని రోజులుందో తెలిస్తే?
చలిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగానే ఎక్కువగా ఉంది.
భారత వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. ఈ ఏడాది చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పింది. భారీ వర్షాలతో పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. అలాగే భారీ వర్షాలు కూడా పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే భారీ వర్షాలు పడ్డాయి. ఇక తుపానులు, అల్పపీడనాలు కూడా వరసగా ఏర్పడ్డాయి. చలిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగానే ఎక్కువగా ఉంది. గత వారం రోజుల నుంచి దేశ వ్యాప్తంగా చలిగాలులు వీస్తున్నాయి. మంచు కురుస్తుంది.
పర్యాటక రంగంపై ప్రభావం...
ఆంధ్రప్రదేశ్ లోనూ గత వారం రోజుల నుంచి చలిగాలు తీవ్రత ఎక్కువగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే సముద్రతీర ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక ఏజెన్సీ ప్రాంతంలో చెప్పాల్సిన పనిలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో ప్రజలు చలిగాలుల తీవ్రతకు ప్రజలు భయపడిపోతున్నారు. బయటకు కూడా రాలేకపోతున్నారు. ఇక అరకు, లంబసింగి వంటి పర్యాటక ప్రాంతాలకు ఈ సీజన్ లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారు. కానీ ఇటీవల కాలంలో పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిందని స్థానికులు చెబుతున్నారు. అరకు, లంబసింగిలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పొగమంచుతో ఇబ్బందులు...
తెలంగాణలోనూ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. గత వారం రోజుల నుంచి పొగమంచుతో పాటు చలితీవ్రత ఎక్కువ కావడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు బయటకు రావడం లేదు. హైదరాబాద్ వంటి ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి. ముఖ్యంగా కొమ్రంభీ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంది. ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉదయం, రాత్రి వేళల్లో చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. ఒక ఉదయం వేళ ఎనిమిది గంటల వరకూ పొగమంచు వీడటం లేదు. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎనిమిది గంటల వరకూ లైట్లు వేయకుండా ప్రయాణించలేని పరిస్థితి.ప్రజలు తగిన జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.