తెలుగు ప్రజలు అన్నిరంగాల్లో భేష్ : ప్రధాని మోదీ

విశాఖ నగరం గురించి మాట్లాడుతూ.. దేశంలో విశాఖపట్నానికి ఎంతో ప్రత్యేకత ఉందని, ఇదొక ప్రత్యేక నగరమని పేర్కొన్నారు. వాణిజ్య

Update: 2022-11-12 09:28 GMT

pm modi speech

దేశంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికై కేంద్రం తన వంతు కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. విశాఖలో రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ,ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగసభలో ప్రధాని మాట్లాడారు. దేశంలో వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి ఆకాంక్ష జిల్లాల కార్యక్రమాన్ని తీసుకుని.. అభివృద్ధి వేగాన్ని పెంచామన్నారు. ఏపీ ప్రజలు తమపై చూపించే ఆప్యాయత ఎనలేనిదని ప్రశంసించారు. అన్ని రంగాల్లోనూ తెలుగు ప్రజలు తమ సత్తా చాటుతున్నారని తెలిపారు.

విశాఖ నగరం గురించి మాట్లాడుతూ.. దేశంలో విశాఖపట్నానికి ఎంతో ప్రత్యేకత ఉందని, ఇదొక ప్రత్యేక నగరమని పేర్కొన్నారు. వాణిజ్య నగరంగా విశాఖపట్టణానికి పేరుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఒకప్పుడు విశాఖ ఓడరేవు నుండి పశ్చిమాసియా, తూర్పు ఆసియాలకు ఓడల ద్వారా వ్యాపారం జరిగిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. నేడు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన పథకాలు ఏపీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఏపీ ప్రజలు విద్యార్జనతో పాటు.. స్నేహ, సేవా స్వభావాలు గుర్తింపుకి కారణమన్నారు. రైల్వేలు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు అత్యాధునిక వసతులతో కల్పిస్తున్నామని చెప్పారు.
ప్రస్తుతం ఎందరో భారతదేశ విధి విధానాలను ప్రశంసిస్తున్నారని చెప్పారు. దేశం ప్రపంచ గమనానికి కేంద్రం అవుతోందని తెలిపారు ప్రధాని మోదీ. ఈ సమయంలో కూడా భారత్ ఎన్నో అడ్డుగోడలు బద్దలు కొట్టి అభివృద్ధి దిశగా సాగుతోందని తెలిపారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఎల్లప్పుడూ సహకరిస్తుందన్నారు.



Tags:    

Similar News