మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 40 పైసలు చొప్పును పెంచాయి. తాజాగా పెరిగిన ధరలతో..విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.118.55కి

Update: 2022-04-04 03:32 GMT

న్యూ ఢిల్లీ : భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతుండటంతో.. సామాన్యుడు షాకవుతున్నాడు. ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు సోమవారం పెట్రోల్,డీజిల్ ధరలను విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 40 పైసలు చొప్పును పెంచాయి. తాజాగా పెరిగిన ధరలతో.. దేశ రాజధాని ఢిల్లీలో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.81కి, డీజిల్ లీటరుకు రూ.94.07కి చేరుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.118.55కి చేరగా, డీజిల్ ధర రూ.105.90కి పెరిగింది. అలాగే విశాఖలో పెట్రోల్ ధర రూ.118.02ఉండగా.. డీజిల్ ధర రూ. 104.46గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.53కి పెరగ్గా.. డీజిల్ ధర రూ.103.60గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.71, డీజిల్ ధర రూ.103.81గా ఉన్నాయి.


Tags:    

Similar News