ఏపీలో కాకరేపుతున్న పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలు.. ఎర్రమట్టి దిబ్బలే టార్గెట్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖపట్నంలో తన పర్యటన కొనసాగిస్తున్నారు..

Update: 2023-08-17 04:02 GMT
  • రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న పవన్‌ వ్యాఖ్యలు
  • రోజుకో మలుపు తిప్పుతున్న ఏపీ పాలిటిక్స్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖపట్నంలో తన పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో ఏపీ రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. పవన్‌ లేవనెత్తే అంశాలు, జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో చేసే విమర్శలు, ఆరోపణలతో యాత్ర ముందుకు సాగుతోంది. రుషికొండ, విసన్నపేటలో వివాదస్పదమైన భూములను పరిశీలించిన పవన్‌ అక్రమాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయంటూ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. జరుగుతున్న పర్యావరణ ఉల్లంఘనలపై గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. పవన్‌ కల్యాణ్‌ మాటలు రోజుకో విధంగా ఏపీ రాజకీయాల్లో మలుపులు తిప్పుతోంది. ఎర్రమట్టి దిబ్బల సాక్షిగా.. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. భీమిలిలో అత్యంత అరుదైన ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి. అయితే శ్రీలంక, తమిళనాడు, భీమిలిలో మాత్రమే ఉన్న అరుదైన దిబ్బలవి. గతంలో దాదాపు 1200 ఎకరాల్లో ఉన్న ఈ దిబ్బలు.. ఇప్పుడు 292 ఎకరాలకే పరిమితం అయ్యాయి. వీటిటి కాపాడుకోవాల్సింది పోయి అక్రమణలకు గురవుతున్నాయంటూ పవన్‌ మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ బిజినెస్‌ మ్యాన్‌లకు లబ్ధి చేకూర్చేలా అక్కడ లే ఔట్లు వేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.

ఎర్రమట్టి దిబ్బల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు పవన్. ఆసియా మొత్తంలోనే మూడు ప్రాంతాల్లో మాత్రమే ఏర్పడ్డ ఈ ఎర్రమట్టి దిబ్బలు జియో హెరిటేజ్‌ గుర్తింపు పొందాయని, అలాంటి అరుదైన వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పవన్‌ డిమాండ్‌ చేశారు.జనసేన. ఎర్రమట్టి దిబ్బలు ఉన్న ప్రాంతాల్లో బఫర్‌ జోన్‌ ఏర్పాటు చేసి.. రక్షణ కల్పించాలనేది జనసేన డిమాండ్. దీనిపై 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే గ్రీన్ ట్రిబ్యూనల్ వరకూ వెళ్తామంటున్నారు. అయితే రాజకీయంగా మైలేజ్ పెంచుకునేందుకే పవన్ హడావుడి చేస్తున్నారనీ.. అక్కడ ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలు జరగలేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. పవన్ మాటలను ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరంటున్నారు.

పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ ప్రజా కోర్టు, ప్రజవాణి వంటి కార్యక్రమాలలో మాట్లాడే మాటలు సినిమా టైటిల్స్‌, టీవీ సీరియల్స్‌ కు పనికొస్తాయంటూ వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ పర్యటనలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అయితే పవన్‌ ఎర్రమట్టి దిబ్బలపై చేసిన ఆరోపణలు మరింత ఏపీ రాజకీయాల్లో మరింత కాకరేపుతున్నాయి. అయితే ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణకు పవన్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం స్పందిస్తుందా.. ?లేదా అనేది వేచి చూడాలి. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. అటు టీడీపీ, ఇటు జనసేన మాటలతో వైసీపీ నేతలలో రోషం పుట్టుకొచ్చేలా చేస్తున్నాయి. అందుకు వైసీపీ నేతలు కూడా తామేమి తగ్గిదిలే.. అన్నట్లు ఎదురు కౌంటర్లు ఇస్తున్నారు. తెలంగాణలో ఉండే రాజకీయాల కంటే ఏపీలోనే పార్టీల మధ్య చుచ్చుపెట్టేలా ఉన్నాయి.

Tags:    

Similar News