బీజేపీని అడిగే దిగా

రాజధాని విషయంలో బీజేపీతో సంప్రదించిన తర్వాతనే తాను పొత్తు పెట్టుకున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటించారు. బీజేపీ కూడా రాజధానిని [more]

Update: 2020-02-15 08:07 GMT

రాజధాని విషయంలో బీజేపీతో సంప్రదించిన తర్వాతనే తాను పొత్తు పెట్టుకున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటించారు. బీజేపీ కూడా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని చెబుతుందని రైతులతో చెప్పారు. ఢిల్లీ ఎన్నికల ఉన్నందున రైతులకు అనుకూనంగా తాము లాంగ్ మార్చ్ చేయలేకపోయామని, ఎవరు వచ్చినా రాకున్నా తాను ర్యాలీ చేస్తానని పవన్ స్పష్టం చేశారు. దేశానికి మోడీ ప్రధాని అని, పార్టీకి కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజధాని రైతులకు తాను అండగా ఉంటానని చెప్పారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించేంత వరకూ పోరాడాలని ఆయన రైతులకు పిలుపు నిచ్చారు.

Tags:    

Similar News