Tirumala : తిరుమలకు వెళ్లే వారికి నేడు అలెర్ట్.. వేచి ఉండాల్సిన సమయం ఎంతంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.

Update: 2025-12-06 02:54 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. దిత్వా తుపాను ప్రభావం కూడా కొంత మేరకు తగ్గడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో దర్శనానికి భక్తులు గంటల తరబడి సమయం వేచి చూడాల్సి వస్తుంది. కంపార్ట్ మెంట్లలోనే భక్తులు ఉండటంతో వారికి అవసరమైన ఏర్పాట్లను టీటీడీ అధికారులు చేపట్టారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వసతి గృహాల కోసం కూడా భక్తులు గంటల సేపు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు కూడా ఇదే రకమైన రద్దీ కొనసాగే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

వైకుంఠ ద్వార దర్శనానికి...
వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 08వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అందుబాటులో ఉన్న 182 గంటల దర్శన సమయంలో 164.15 గంటల సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయించారు. ఈ పది రోజులలో 7.70 లక్షల మంది భక్తులకు దర్శన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల చేయనున్నారు. 10 రోజులలో తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయరు. ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
పదిహేను కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదిహేను కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు ఈరోజు శ్రీవారి దర్శనం పది నుంచి పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,336 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 25,063 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.68 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News