అంతా విజయసాయిరెడ్డి వల్లే

తాను నిబంధనలను అతిక్రమించలేదని టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ తెలిపారు. అన్యాయంగా తన భవనాన్ని మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారన్నారు. తన భవనాన్ని కూల్చడానికి ప్రధాన కారణం విజయసాయిరెడ్డి [more]

Update: 2021-04-26 00:52 GMT

తాను నిబంధనలను అతిక్రమించలేదని టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ తెలిపారు. అన్యాయంగా తన భవనాన్ని మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారన్నారు. తన భవనాన్ని కూల్చడానికి ప్రధాన కారణం విజయసాయిరెడ్డి అని పల్లా శ్రీనివాస్ ఆరోపించారు. తనను వైసీపీలో చేరమని విజయసాయిరెడ్డి వత్తిడి తెచ్చారని, అయితే తాను చేరనందుకే తన భవనాన్ని అక్రమ నిర్మాణమంటూ జీవీఎంసీ అధికారులకు చెప్పి కూల్చివేయించారని పల్లా శ్రీనివాస్ తెలిపారు. భవనాన్ని కూల్చి వేయడం ద్వారా విజయసాయిరెడ్డి పైశాచికానందాన్ని పొందుతున్నారన్నారు. తన భవన నిర్మాణంలో ఎలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన జరగలేదని పల్లా శ్రీనివాస్ తెలిపారు.

Tags:    

Similar News