బ్రేకింగ్ : విజయనగరంలో ఆక్సిజన్ అందక… ఐదుగురి మృతి?

విజయనగరం మహారాజా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆక్సిజన్ కొరతతో ఐదుగురు కరోనా రోగులు మృతి చెందినట్లు సమాచారం. ఎంతమంది మరణించారన్న విషయం ఇంకా బయటకు రాకపోయినా [more]

Update: 2021-04-26 02:23 GMT

విజయనగరం మహారాజా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆక్సిజన్ కొరతతో ఐదుగురు కరోనా రోగులు మృతి చెందినట్లు సమాచారం. ఎంతమంది మరణించారన్న విషయం ఇంకా బయటకు రాకపోయినా మృతులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజన్ కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. అయినా కరోనా వ్యాప్తి పెరిగిపోవడం, ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. విజయనగర మహారాజా ఆసుపత్రిలో ఉన్న ఇతర రోగులను వేరే ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ఐదుగురు మృతి చెందినట్లు తెలిసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

Tags:    

Similar News