కేంద్రమంత్రి ప్రకటన ఆశ్చర్యం కల్గించలేదు

Update: 2018-07-14 13:39 GMT

కేంద్రమంత్రి రాందాస్ అధవాలే ప్రకటన తనకు ఆశ్చర్యం కల్గించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్రమంత్రి రాందాస్ అధవాలే ఎన్డీఏలోకి వైసీపీని ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీలో చేరడానికి వైసీపీ తహతహలాడుతుందన్నారు. వైసీపీ లోపల విశ్వాసం, బయట అవిశ్వాసంగా బీజేపీతో లాలూచీ రాజకీయాలు నడుపుతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ, బీజేపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటికి పవన్ వంత పాడుతున్నారని అన్నారు. కేసుల విషయంలోనే వైసీపీ బీజేపీతో లాలూచీ పడిందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన పార్టీని జనం ఆదరించలేదని, అందుకే ఆయన మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారన్నారు.

Similar News