ప్రజల ప్రాణాలంటే జగన్ కు లెక్కే లేదు

ప్రజల ప్రాణాలంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లెక్కే లేదని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. కనీసం కరోనా టెస్ట్ లు చేయలేని పరిస్థితిలో [more]

Update: 2021-05-09 00:28 GMT

ప్రజల ప్రాణాలంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లెక్కే లేదని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. కనీసం కరోనా టెస్ట్ లు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఆక్సిజన్ కొరత కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారని నక్కా ఆనంద్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకక ఆంబులెన్స్ లోనే చికిత్స పొందుతున్న దృశ్యాలు కలచి వేస్తున్నాయన్నారు. వ్యాక్సిన్ వేయాలన్న ఆలోచన కూడా ఈ ముఖ్యమంత్రి జగన్ కు లేదని నక్కా ఆనంద్ బాబు అన్నారు.

Tags:    

Similar News