భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ నేషనల్ గైడ్స్ కమిషనర్‌గా కవిత
విజయాల ట్రాక్ రికార్డ్‌తో, కవిత 2015 నుండి స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమీషనర్‌గా సేవలందిస్తున్నారు. ఆమె నాయకత్వంలో..
Bharat Scouts and Guides commissioner, brs mlc kalvakuntla kavitha
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ నేషనల్ గైడ్స్ కమిషనర్‌గా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. ఈ విషయాన్ని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ కౌశిక్ అధికారికంగా ప్రకటించారు. జాతీయ గైడ్స్ కమిషనర్‌గా కవిత ఏడాది పాటు కొనసాగనున్నారు.
2015 నుండి సేవలు
విజయాల ట్రాక్ రికార్డ్‌తో, కవిత 2015 నుండి స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమీషనర్‌గా సేవలందిస్తున్నారు. ఆమె నాయకత్వంలో, సంస్థ వివిధ సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలలో విద్యార్థుల భాగస్వామ్యం పెరగడానికి అంకితభావంతో కృషి చేస్తానని కవిత ఈ సందర్భంగా తెలిపారు.