April6-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందారు. ఈ మేరకు న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఓహియో స్టేట్‌ క్లీవ్‌లాండ్‌లో ఉమా సత్యసాయి గద్దె అనే విద్యార్థి మృతి చెందాడు. అయితే మృతుడి స్వస్థలంతో సహా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2024-04-06 12:13 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందారు. ఈ మేరకు న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఓహియో స్టేట్‌ క్లీవ్‌లాండ్‌లో ఉమా సత్యసాయి గద్దె అనే విద్యార్థి మృతి చెందాడు. అయితే మృతుడి స్వస్థలంతో సహా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Ys Jagan : వీళ్లనా జగనన్నా నువ్వు ఎమ్మెల్సీలుగా చేసింది... వైసీపీ క్యాడర్ సూటి ప్రశ్న

నమ్మి పదవులు ఇచ్చిన వాళ్లే కాదని వెళ్లిపోతున్నారు.. సీటు రాలేదని కొందరు.. సరైన గౌరవం లేదని మరికొందరు... ఎన్నికల సమయంలో జగన్ ను వదిలి వెళ్లిపోతున్నారు. తాను అధికారంలో ఉన్నా లేకున్నా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన వాళ్లే నేడు కాదనుకుని వెళ్లిపోతుండటాన్ని ఫ్యాన్ పార్టీ క్యాడర్ జగన్ ను సూటిగా ప్రశ్నిస్తుంది.

Ys Sharmila : అన్నపై నేరుగా యుద్ధం... ఓడించాలంటూ జనంలోకి అక్కా చెల్లెళ్లు

కడప జిల్లాలో వైఎస్ కుటుంబంలో అక్కా చెల్లెళ్లు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇద్దరూ కలసి రోడ్‌ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. నిన్నటి నుంచి కడప జిల్లాలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోడ్ షోలు, బహిరంగ సభల్లో వైఎస్ షర్మిలతో పాటు..

IPL 2024 : నిజంగానే జెర్సీ మార్చగానే అదృష్టం మామూలుగా పట్టలేదుగా.. లేదంటే ఈ విజయాలేంటి?

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ఏ దశలోనూ విజయం చెన్నై పక్షాన మొగ్గు చూపలేదు. సన్ రైజర్స్ విజయం ఖాయమని ముందుగానే తేలిపోయింది. పెద్దగా ఉత్కంఠ లేని మ్యాచ్ హైదరాబాద్ వాసులను మాత్రం అలరించిందనే చెప్పాలి.

Breaking : హైదరాబాద్‌లో మరో హిట్ అండ్ రన్ కేసు...కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదం.. ఇద్దరు వ్యక్తుల మృతి

హైదరాబాద్‌లో మరో హిట్ అండ్ రన్ కేసు వెలుగులోకి వచ్చింది. నగరంలోని కేబుల్ బ్రిడ్జిపై కొద్దిసేపటి క్రితం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కేబుల్ బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వాహనం ఢీకొనింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

BJP : గవర్నర్ వద్దకు బీజేపీ నేతలు.. ఫోన్ ట్యాపింగ్ కేసును

ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ నేతృత్వంలో బృందం గవర్నర్ ను కలసి వినతిపత్రాన్ని సమర్పించింది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుందని, ఈ కేసులో అనేక మంది అధికారులు అరెస్టయ్యారన్నారు.

Telangana Congress : నేడు కాంగ్రెస్ జనజాతర

తెలంగాణ కాంగ్రెస్ నేడు భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. తుక్కుగూడలో జరగనున్న ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా తుక్కుగూడలో జాతీయ మ్యానిఫేస్టోను రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు.

Breaking : కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్

తెలంగాణలో జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేష్ ను ప్రకటించింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఈ ఉప ఎన్నిక జరగనుంది. 2023 లో జరిగిన ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత విజయం సాధించారు.

Pawan Kalyan : పవన్ పిఠాపురంలో నివాసం ఉండేది ఇక్కడే.. హెలిప్యాడ్ తో సహా అన్ని ఏర్పాట్లు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందుకోసం ఒక భవనాన్ని నేతలు సిద్ధం చేశారు. ఈ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ అక్కడే నివాసం ఉంటానని ఇటీవల జరిగిన నాలుగు రోజుల పాటు ప్రచారంలో ప్రకటించిన నేపథ్యలో నేతలు ఆయన నివాసం ఉండేందుకు ఒక భవనాన్ని చూశారు.

Kalvakuntla Kavitha : సీబీఐ విచారణపై కోర్టును ఆశ్రయించిన కవిత

తనను సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. సీబీఐ దరఖాస్తు తమకు ఇవ్వలేదని ఆమె పిటీషన్ లో పేర్కొన్నారు. సిబీఐని తీహార్ జైలులోనే విచారించాలని నిన్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ ను కోర్టు బుధవారం విచారించే అవకాశముంది.


Tags:    

Similar News