Wed Mar 11 2026 14:21:48 GMT+0530 (India Standard Time)
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందారు. ఈ మేరకు న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ప్రకటించింది

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందారు. ఈ మేరకు న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఓహియో స్టేట్ క్లీవ్‌లాండ్‌లో ఉమా సత్యసాయి గద్దె అనే విద్యార్థి మృతి చెందాడు. అయితే మృతుడి స్వస్థలంతో సహా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విద్యార్థి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి పంపడానికి అవసరమైన సాయం అందిస్తామని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
పోలీసులు దర్యాప్తు...
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు ‘ఎక్స్’ లో తెలిపారు. ఈ ఏడాదిలో వరసగా ఇది పదవ భారతీయ విద్యార్థి మరణం కావడంతో అమెరికాలో ఉంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో వరసగా భారతీయుల మరణాలపై కారణాలు కనుగొని తగిన చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. ఎక్కువ మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు.
Next Story

