April18-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

ఓటుకు నోటు కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టు వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. దీంతో ఓటుకు నోటు కేసు జులై 24న విచారణ చేపట్టనుంది.

Update: 2024-04-18 13:30 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Supreme Court : ఓటుకు నోటు కేసు వాయిదా

ఓటుకు నోటు కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టు వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. దీంతో ఓటుకు నోటు కేసు జులై 24న విచారణ చేపట్టనుంది.

Alliance : ఎవరికి వారే.. సమన్వయ లోపం... గుర్తుల ప్రచారంపై అధినేతల సీరియస్

ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన కూటములు తలనొప్పిగా తయారయింది. టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు ఉమ్మడిగా అనేక చోట్ల ప్రచారాన్ని నిర్వహించడం లేదు. పైగా శాసనసభ అభ్యర్థులు తాము పోటీ చేసే స్థానాల్లో కేవలం తమ పార్టీ గుర్తునే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నం పార్టీ అధినేతల దృష్టికి రావడంతో వారు క్లాస్ పీకినట్లు తెలిసింది.

YSRCP : వైసీపీ మ్యానిఫేస్టో రెడీ అయిపోయిందట.. ఈసారి అందరూ విస్తుపోయేలా?

వైసీపీ అధినేత జగన్ మ్యానిఫేస్టో పై ఇంకా కసరత్తులు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపును సాధించడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సు యాత్ర పూర్తయిన తర్వాత కీలకమైన నియోజకవర్గాలలో పర్యటించేందుకు ఆయన మళ్లీ సిద్ధమవుతున్నారు. ఈ నెల 24వ తేదీన నామినేషన్ వేసిన అనంతరం తర్వాత మళ్లీ జనంలోకి వెళ్లడంపై రూట్ మ్యాప్ ను కూడా రెడీ చేస్తున్నారు.

Telangana : ఎవరీ కళారెడ్డి.. తెలంగాణ నుంచి వెళ్లి ఉత్తర్‌ప్రదేశ్ ఎంపీగా పోటీ చేస్తున్నారంటే?

ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో తెలంగాణకు చెందిన మహిళ శ్రీకళారెడ్డి పార్లమెంటు సభ్యురాలిగా పోటీ చేస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీకళా రెడ్డి ఉత్తర్‌ప్రదేశ్ కు చెందిన ధనుంజయ్ సింగ్ ను వివాహమాడారు. ధనుంజయ్ సింగ్ గతంలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. అయితే ధనుంజయ్ సింగ్ కు శ్రీకళారెడ్డి మూడో భార్య.

Adimulapu Suresh : వైసీపీలో మరో గంటా..ఈసారి కూడా లక్ చేతికి దక్కేనా?

కొందరు రాజకీయనేతలుంటారు. ప్రతి ఎన్నికకు నియోజకవర్గం మారుతుంటారు. టీడీపీలో ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో మరొకసారి పోటీ చేయరు. అందుకే ఆయనకు ఓటమి దరి చేరదు. దాదాపుగా అన్ని సార్లు ఆయన గెలుస్తూనే వస్తున్నారు.

IPL 2024 : టైటాన్స్ బలహీన పడటానికి కారణమేంటి? ఢిల్లీ పుంజుకోవడానికి రీజన్ ఏంటి?

ఐపీఎల్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అంది వచ్చిన అవకాశాలను పుచ్చుకుంటూ వస్తే సరి. లేదంటే అట్టడుగుకు వెళ్లిపోయిన జట్లను చూశాం. వన్డే వరల్డ్ కప్ లో అన్ని జట్లను ఓడించి కాలరెగరేసిన టీం ఇండియా చివరకు ఫైనల్స్ లో చేతులెత్తేసిన సంగతినీ మనం మరచిపోలేం.

Gold Prices Today : ఎండల్లో హాయ్... హాయ్...తగ్గింది జాయ్.. జాయ్

బంగారం ధరలు ఎండలను మించి మండిపోతున్నాయి. అస్సలు తగ్గేదే లేదన్నట్లుగా ఇటీవల కాలంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం ధరలు బ్రేకులు లేకుండా పరుగులు పెడుతుంది. అసలు బంగారాన్ని మనం సొంతం చేసుకునే అవకాశముందా? అన్న అనుమానాలు కూడా అనేక మందిలో బయలుదేరాయి.

రాయిదాడి కేసులో సతీష్ అరెస్ట్.. కోర్టులో హాజరు

ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి కేసులో సతీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సతీష్ కు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యాయస్థానంలో సతీష్ ను ప్రవేశపెట్టారు. విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతుండగా సతీష్ ముఖ్యమంత్రి జగన్ పై రాయితో దాడి చేశారు.

Kurnool bus accident:బస్సు ప్రమాదం.. ఇద్దరు మృతి

Kurnool bus accident:కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓర్వకల్లు మండలం పూడి చెర్లమెట్ట వద్ద కల్వర్టును ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌ శ్రీనివాసులుతో పాటు మరో ప్రయాణికుడు రాములు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

Breaking : జనసేనకు షాకిచ్చిన తూర్పుగోదావరి జిల్లా నేతలు..కీలక నేతలు జంప్

రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత బొంతు రాజేశ్వరరావు ఆ పార్టీని వీడారు. ఆయన తిరిగి వైసీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో బొంతు రాజేశ్వరరావు వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలిచిన రాపాక వరప్రసాదరావు వైసీపీలో చేరడంతో ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.



Tags:    

Similar News