Fri Dec 05 2025 12:04:42 GMT+0000 (Coordinated Universal Time)
Kurnool bus accident:బస్సు ప్రమాదం.. ఇద్దరు మృతి
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

Kurnool bus accident:కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓర్వకల్లు మండలం పూడి చెర్లమెట్ట వద్ద కల్వర్టును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ శ్రీనివాసులుతో పాటు మరో ప్రయాణికుడు రాములు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
కల్వర్ట్ ను ఢీకొని...
గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. తిరుపతి నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టార. ప్రమాదానికి అతివేగమే కారణమని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

