Sat Mar 07 2026 15:37:57 GMT+0530 (India Standard Time)
రాయిదాడి కేసులో సతీష్ అరెస్ట్.. కోర్టులో హాజరు
ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి కేసులో సతీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి కేసులో సతీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సతీష్ కు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యాయస్థానంలో సతీష్ ను ప్రవేశపెట్టారు. విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతుండగా సతీష్ ముఖ్యమంత్రి జగన్ పై రాయితో దాడి చేశారు.
న్యాయమూర్తి ఎదుట...
ఈ రాయి దాడి ఘటనలో ముఖ్యమంత్రి జగన్ నుదుటిపై గాయమయింది. పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా గాయమయిన సంగతి తెలిసిందే. విజయవాడ సింగ్ నగర్ కు చెందిన సతీష్ ఈ రాయి దాడి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో సతీష్ ను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు.
Next Story

