April11-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. తణుకులో జరిగిన రోడ్ షో లో ఆయన మాట్లాడారు.కన్నెర్ర చేస్తే చిప్ప పట్టుకుని జగన్ ఎక్కడకు వెళతాడంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతి క్షణం అభివృద్ధి కోసం తపించామని తెలిపారు. పోలవరాన్ని 72 శాతం పూర్తి చేసిన బాధ్యత ఎన్డీఏ పార్టీలకే దక్కిందన్నారు.

Update: 2024-04-11 12:51 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Chandrababu : జగన్ ను నమ్మొద్దండీ.. ఫేక్ ఫెలో : చంద్రబాబు

రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. తణుకులో జరిగిన రోడ్ షో లో ఆయన మాట్లాడారు.కన్నెర్ర చేస్తే చిప్ప పట్టుకుని జగన్ ఎక్కడకు వెళతాడంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతి క్షణం అభివృద్ధి కోసం తపించామని తెలిపారు. పోలవరాన్ని 72 శాతం పూర్తి చేసిన బాధ్యత ఎన్డీఏ పార్టీలకే దక్కిందన్నారు.

Ys Sharmila : షర్మిలలో భయం మొదలయిందా... ఆ ఒక్కటే ఆశ ఇక మిగిలిందా?

అవును.. కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలకు తొలిసారి సొంత జిల్లాల్లో జనం నుంచి వినిపిస్తున్న స్పందన అర్థమవుతుంది. నాడి తెలిసిపోయినట్లుంది. ఆమె కడప నుంచి పోటీ చేయడమే అతి పెద్ద రాజకీయ సాహసమని ఆమె కూడా అంగీకరించే పరిస్థితులు నెలకొన్నాయి.

Summer special trains : కృపయా ధ్యాన్ దే .. వేసవి రైళ్లు పట్టాలపైకి వస్తున్నాయ్

సమ్మర్ లో చాలా మంది పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు వెళుతుంటారు. పిల్లలకు వేసవి సెలవులు ఉండటంతో పాటు వేసవి కాలంలో అయితే ఇబ్బంది లేకుండా ప్రయాణాలు చేయవచ్చని, పర్యాటక ప్రదేశాలు చూడవచ్చని భావిస్తారు. మరికొందరు తమ సొంతూళ్లకు వెళ్లి అక్కడ గడిపేందుకు ఇష్టపడతారు.

Prashanth Kishore : ప్రశాంత్ కిషోర్ చెప్పిందే నిజం కానుందా...? వైసీపీలో అంతర్గత చర్చ.. ఎన్నికల వేళ ఫ్యాన్ పార్టీలో గందరగోళం

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య ఏపీ రాజకీయాలపై చేసిన కామెంట్స్ ఇంకా రాజకీయాల్లో నలుగుతూనే ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి రావడం కష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు. పీటీఐ నిర్వహించిన ఎడిటర్ల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Karnataka : బెంగలూరులో ముదిరిన నీటి సంక్షోభం.. ఎంతగా అంటే.. టాయ్‌లెట్ కు వెళ్లాలన్నా?

బెంగలూరులో నీటి ఎద్దడి మరింత తీవ్ర రూపం దాల్చింది. కర్ణాటక రాజధాని అయిన బెంగలూరులో నీటి కష్టాలు తప్పడం లేదు. తాగునీటి కొరత మొత్తం బెంగళూరు బిజినెస్ వ్యవస్థనే సమూలంగా మార్చేసింది. అనేక చిరు హోటళ్లు ఇప్పటికే నీటి కొరతతో మూత బడ్డాయి. పెద్ద పెద్ద హోటల్స్ లో టాయ్‌లెట్ కు వెళ్లాలన్నా టోకెన్ సిస్టమ్ పెడుతుండటం విశేషం.

IPL 2024 : గిల్ ఆడితే అంతే మరి.. ఎంతటి స్కోరు అయినా అలా చేతికి అందిరావాల్సిందే

ఐపీఎల్ లో మ్యాచ్ లు అద్భుతంగా జరుగుతున్నాయి. జట్ల మధ్య పోటీ మామూలుగా లేదు. గెలిచేంత వరకూ ఎవరిది పై చేయి అనేది చెప్పడం కష్టమే. నిన్న గుజరాత్ టైటన్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ చూసిన వారికి ఎవరికైనా ఇదే రకమైన అభిప్రాయం కలుగుతుంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చూసి, ఆ జట్టు చేసిన స్కోరుతో దానితే విజయం అని అందరూ అనుకున్నారు.

Breaking : కల్వకుంట్ల కవిత మళ్లీ అరెస్ట్.. ఈసారి సీబీఐ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు ప్రకటించారు. ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశముంది. కవితను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చానున్నారని తెలిసింది. ఈ నెల 6వతేదీన తీహార్ జైలులో కవితను విచారించిన సీబీఐ అధికారులు నేడు అరెస్ట్ చేసినట్లు చూపించారు.

పాండ్యా బ్రదర్స్ నుంచి 4.3 కోట్లు నొక్కేసింది ఎవరో తెలిస్తే?

యువ క్రికెటర్లు పాండ్యా బ్రదర్స్ ను మోసం చేసిన కేసులో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. 4.30 కోట్ల రూపాయల మేరకు మోసానికి పాల్పడటంతో పోలీసులు వైభవ్ పాండ్యాను అదుపులోకి తీసుకున్నారు. ముంబయి పోలీసుల కథనం ప్రకారం హార్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాకు సమీప బంధువు అయిన వైభవ్ పాండ్య తో కలసి బిజినెస్ ప్రారంభించారు.

Andhra Pradesh : రేపే ఇంటర్ రిజల్ట్... గుడ్ న్యూస్ చెప్పిన ఇంటర్ బోర్డు

ఆంధప్రదేశ్ లో ఇంటర్ పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం పదకొండు గంటలకు పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా ఇంటర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది శుభవార్తగానే చెప్పకోవాలి.

ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్న ఎలాన్ మస్క్

ప్రధాని నరేంద్రమోదీతో ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ భేటీ కానున్నారు. దేశంలో టెస్లా కార్ల కంపెనీ తయారీ పరిశ్రమ స్థాపనపై ఇద్దరి మధ్య చర్చలు జరగనున్నాయి. తాను ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతున్న విషయాన్ని ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. దీంతో దేశంలోని పారిశ్రామిక రంగంలో ఆసక్తి నెలకొంది.




Tags:    

Similar News