Thu Dec 18 2025 22:59:42 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్న ఎలాన్ మస్క్
ప్రధాని నరేంద్రమోదీతో ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ భేటీ కానున్నారు.

ప్రధాని నరేంద్రమోదీతో ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ భేటీ కానున్నారు. దేశంలో టెస్లా కార్ల కంపెనీ తయారీ పరిశ్రమ స్థాపనపై ఇద్దరి మధ్య చర్చలు జరగనున్నాయి. తాను ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతున్న విషయాన్ని ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. దీంతో దేశంలోని పారిశ్రామిక రంగంలో ఆసక్తి నెలకొంది. టెస్లా కంపెనీ తయారీ పరిశ్రమ దేశంలోకి వస్తే ఉపాధి అవకాశాలు మరింత పెరగడమే కాకుండా, పెట్టుబడులను మరింత ఆకర్షించే దేశంగా భారత్ నిలవనుంది.
ఈ నెలాఖరులో...
ఈ నెలాఖరులో ఎలాన్ మస్క్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశం కోసం తాను ఎదురు చూస్తున్నానని ఎలాన్ మస్క తెలపడంతో వీరి భేటీ త్వరలోనే జరగనుంది. టెస్లా కార్ల తయారీ సంస్థ ను స్థాపించడంపైనే ప్రధానంగా ఇద్దరి మధ్య చర్చలు జరిగే అవకాశముంది. ఇది మోదీ విజయంగా భావిస్తున్నారు. అయితే టెస్లా పరిశ్రమను ఎక్కడ స్థాపిస్తారన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో పెట్టుబడులు పెట్టేలా ఎలాన్ మస్క్ ను కోరాలని పలువురు కోరనున్నారు.
Next Story

