10May-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

విదేశాల నుండి ఎన్ ఆర్ ఐ లు రావడం తో ఢిల్లీ, విజయవాడ ఎయిర్ పోర్టులలో రద్దీ ఏర్పడింది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి మునుపెన్నడూ లేని విధంగా సుదూర ప్రాంతాల నుండి అనేక మంది వచ్చారు. ప్రధానంగా నాలుగోదశలో తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు స్వదేశానికి చేరుకుంటున్నారు.

Update: 2024-05-10 13:03 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Ap Politics : బస్సులు, రైళ్లేకాదండోయ్.. విమానాశ్రయాల్లో రద్దీ చూశారా?

విదేశాల నుండి ఎన్ ఆర్ ఐ లు రావడం తో ఢిల్లీ, విజయవాడ ఎయిర్ పోర్టులలో రద్దీ ఏర్పడింది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి మునుపెన్నడూ లేని విధంగా సుదూర ప్రాంతాల నుండి అనేక మంది వచ్చారు. ప్రధానంగా నాలుగోదశలో తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు స్వదేశానికి చేరుకుంటున్నారు.

TDP : గుంటూరు వెస్ట్‌లో క‌లివిడి లేని కూట‌మి.. ఇలా అయితే ఎలా గెలుస్తావ్ గ‌ల్లా మాధ‌వి..?

కూట‌మి అంటేనే.. విడివిడిగా ఉన్న పార్టీలు కాసేపు సిద్ధాంత రాద్ధాంతాల‌ను కూడా ప‌క్కన పెట్టి.. రాజ‌కీ యాల్లో ప్రత్యర్థుల‌ను ఓడించేందుకు.. ముందుకు రావ‌డం. ఈ క్రమంలో ఆయా పార్టీలు ఉమ్మడి అజెండా లు నిర్దేశించుకుని.. ప్రజ‌ల్లోకి వెళ్లడం. త‌ద్వారా అధికారంలోకి రావడం అనేది కూట‌మి పార్టీల ఉమ్మడి ల‌క్ష్యం.

‍‍NDA Alliance : ముగ్గురిలో ప్లస్ లు ఏంటి? మైనస్ లు ఏంటి?

చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్ ముగ్గురు కలిశారు. ముగ్గురి మైండ్ సెట్ వేరు. అయితే ముగ్గురిదీ అధికారమే ఆఖరి లక్ష్యం. కాని కొన్ని విషయాల్లో మాత్రం ముగ్గురి అభిప్రాయాలు వేరు వేరుగా ఉంటాయి. గత పదేళ్ల నుంచి నరేంద్ర మోదీని, జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కల్యాణ్ ను, నలభై ఐదేళ్ల నుంచి చంద్రబాబును రాజకీయాల్లో చూస్తూనే ఉన్నాం.

Ys Jagan : జగన్ ను ఇబ్బంది పెడుతున్న బలమైన అంశాలు ఇవే.. ఆ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడితే మాత్రం?

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. అందుకు ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నాటి నుంచి అడుగులు వేస్తున్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ నుంచి ఓట్లు వచ్చి పడతాయో గుర్తించి దానిని ముందుగానే పసిగట్టి వాసనపట్టి.. దానినే పట్టుకుని ఐదేళ్లు కొనసాగిన నేతగా ముద్రపడ్డారు. ఎవరి మాట వినరన్న పేరుంది.

IPL 2024 : అందుకే సామీ.. క్యాచ్ వస్తే.. పట్టుకోవాలి.. చేజారింది.. పంజాబ్ చాపచుట్టేసింది

ఐపీఎల్ లో ప్లేఆఫ్ ఆశలు నిలుపుకునేందుకు జట్లు అన్నీ ప్రయత్నిస్తున్నాయి. అయితే ఏ ఒక్క నాలుగు జట్లు మాత్రమే ప్లే ఆఫ్ కు క్వాలిఫై అవుతాయి. అందుకే వీరపోరాటం చేస్తున్నాయి. ఇప్పటి వరకూ జరిగింది ఒక ఎత్తు. ఒక జరగబోయేది మరొక ఎత్తులా ఐపీఎల్ మ్యాచ్ లు నడుస్తున్నాయి. అయితే ఇందులో జట్టులో సమన్వయ లోపం కొందరిని ఓటమి బాట పట్టిస్తుంది.

Janasena : ఇంతకీ ఏం జరుగుతుంది భయ్యా.. అంతా అయోమయంగా ఉందే.. జనసైనికులూ జర భదం బ్రదరూ

సాధారణంగా కూటమిలో ఉన్న నేతలు మిత్రపక్షాలను విమర్శించరు. ఏదైనా లోపాయికారీగా ఇబ్బంది పెడతారేమో కానీ బహిరంగంగా మాత్రం ఎవరూ విమర్శించరు. అదిపార్టీ థిక్కారం కింద వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అసలు కూటమిలో ఏం జరుగుతుందన్న ప్రశ్నలు సామాన్యుడిని వెంటాడుతున్నాయి.

స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్థి మృతి

స్విమ్మింగ్ పూల్ లో పడి ఒక విద్యార్థి మరణించిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. మెయినాబాద్ లోని సుజాతా స్కూలు కు చెందిన విద్యార్థి స్విమ్మింగ్ పూల్ లో ఈతకొడుతూ మరణించారు. అయితే స్కూలు యాజమాన్యం దీనిని గోప్యంగా ఉంచడంతో పాటు పేరెంట్స్ కు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసింది.

Kalvakuntla Kavitha : కవిత బెయిల్ పిటీషన్ పై విచారణ వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 24 వతేదీకి విచారణను వాయిదా వేసింది. ఈడీని వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు కోరింది. కవిత తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.

Kejrival : కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు

అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. కేజ్రీవాల్‌కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరో షాక్ ఇచ్చారు.లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ పాత్రపై ఈడీ ఈరోజు మొదటి చార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయి తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు.

Rahul Gandhi : ఆర్టీసీ బస్సులో రాహుల్ గాంధీ ప్రయాణించి మరీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలోని ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆయన ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆరా తీశారు. స్వయంగా ఆర్టీసీ బస్సు ఎక్కి ఆయన మహిళలతో ముచ్చటించారు. నిన్న సాయంత్రం సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన సభలో ఆయన పాల్గొనేందుకు వచ్చారు. సభ అనంతరం ఆయన దిల్‌సుఖ్ నగర్ వద్ద సిటీ బస్సు ఎక్కి కొద్దిదూరం ప్రయాణించారు.


Tags:    

Similar News