Sun Mar 08 2026 02:17:50 GMT+0530 (India Standard Time)
స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్థి మృతి
స్విమ్మింగ్ పూల్ లో పడి ఒక విద్యార్థి మరణించిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది

స్విమ్మింగ్ పూల్ లో పడి ఒక విద్యార్థి మరణించిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. మెయినాబాద్ లోని సుజాతా స్కూలు కు చెందిన విద్యార్థి స్విమ్మింగ్ పూల్ లో ఈతకొడుతూ మరణించారు. అయితే స్కూలు యాజమాన్యం దీనిని గోప్యంగా ఉంచడంతో పాటు పేరెంట్స్ కు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసింది.
పీఈటీలను చితకబాదిన...
విషయం తెలుసుకున్న విద్యార్థికి చెందిన బంధువులు, తల్లిదండ్రులు స్కూలుకు చెందిన పీఈటీలను చితకబాదారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీఈటీల నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు మరణించాడని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరణించిన విద్యార్థి చేవెళ్లలోని సువంగల్ కు చెందినవారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

