Tue Jan 20 2026 11:23:18 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Gandhi : ఆర్టీసీ బస్సులో రాహుల్ గాంధీ ప్రయాణించి మరీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలోని ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలోని ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆయన ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆరా తీశారు. స్వయంగా ఆర్టీసీ బస్సు ఎక్కి ఆయన మహిళలతో ముచ్చటించారు. నిన్న సాయంత్రం సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన సభలో ఆయన పాల్గొనేందుకు వచ్చారు. సభ అనంతరం ఆయన దిల్సుఖ్ నగర్ వద్ద సిటీ బస్సు ఎక్కి కొద్దిదూరం ప్రయాణించారు.
మహిళలతో ముచ్చట్లు...
ఆయనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఒకటి. దానిపై రాహుల్ గాంధీ ఆరా తీశారు. మహిళలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీని ఆర్టీసీ బస్సులో చూసిన మహిళలు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
Next Story

