కుప్పం వైసీపీ ఇన్ ఛార్జి ఛేంజ్... బాబు వచ్చివెళ్లిన తర్వాత?

కుప్పం ను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పం కే కట్టడి చేయాలన్నది వ్యూహం.

Update: 2022-01-10 04:23 GMT

కుప్పం నియోజకవవర్గాన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పం నియోజకవర్గానికే కట్టడి చేయాలన్నది వైసీపీ వ్యూహం. గత మూడేళ్ల నుంచి కుప్పంలో అమలు పర్చిన వ్యూహాలు సక్సెస్ అయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబును మానసికంగా దెబ్బతీశారు. ఆయన ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు ఉన్నా కుప్పం నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని ప్రజలకు చేర్చడంలో వైసీపీ సక్సెస్ అయిందనే చెప్పాలి.

పెద్దిరెడ్డి కనుసన్నలలోనే....
తమిళనాడు కల్చర్ తో ఉండే కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు పెట్టని కోట. ఇప్పుడు ఆ నియోజకవర్గం బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నట్లే కనపడుతుంది. ఆయన ఇప్పటి వరకూ ఎన్నికల సమయంలోనే కుప్పం బాధ్యతలను నిర్వహించే వారు. అక్కడ గత ఎన్నిలకలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన భరత్ ను ఇన్ ఛార్జిగా నియమించారు. భరత్ కు ఎమ్మెల్సీ పదవిని కూడా జగన్ ఇచ్చారు.
భరత్ సరిపోడన్నది...
అయితే కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు భరత్ సరిపోడన్నది వైసీపీ అగ్రనేతల అంచనా. ఆయనను ఆర్థికంగా, సామాజికర పరంగా ఎదుర్కొనాలంటే బలమైన నేత అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అక్కడ బలమైన నేత ఉంటే చంద్రబాబు తన సీటుపైనే ఎక్కువ దృష్టి పెడతారు. అందుకే ఇక్కడ ఎన్నికలకు ముందు వైసీీపీ రెండంచెల వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. తొలుత టీడీపీ నుంచి ముఖ్యనేతలను మరికొందరిని పార్టీలోకి తీసుకోవడం.
ఇన్ చార్జిని మార్చి.....
మరొకటి వైసీపీ ఇన్ ఛార్జిని మార్చడం. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్న భరత్ ను తప్పించి ఆయన స్థానంలో కొత్త నేతన తేవడం. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయం ఉండటంతో కొత్తనేత ప్రజల్లోకి వెళ్లేందుకు సమయం సరిపోదు. అందుకే వీలయినంత త్వరగా నేతను ఎంపిక చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు కుప్పం పర్యటించి వెళ్లిన తర్వాత దీనిపై వైసీపీ నేతలు మరింత దృష్టి పెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముుడు కమారుడైన సుధీర్ రెడ్డిని ఇన్ చార్జిగా నియమించే అవకాశాలున్నాయి. సుధీర్ రెడ్డి ప్రస్తుతం పుంగనూరు, సదుం, సోమల మండలాల ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. దీనికి జగన్ ఓకే చెప్పాల్సి ఉంది.


Tags:    

Similar News