జంపింగ్ లకు బాబు మార్క్ షాక్...టిక్కెట్ కష్టమే

ఈసారి టిక్కెట్ దక్కని వారిలో కొండ్రు మురళి ఒకరంటున్నారు. ఆయన 2014 ఎన్నికలకు ముందు పార్టీలో చేరారు.

Update: 2022-01-29 12:25 GMT

ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఉంటాయో చెప్పలేం. రెండు పార్టీలు విజయం సాధించేందుకు శక్తియుక్తులు ఒడ్డుతున్నాయి. అదే సమయంలో ఈసారి నమ్మకమైన వారికి టిక్కెట్లు ఇచ్చేందుకే అధినేతలు ఎక్కువగా ప్రయత్నిస్తారు. 2014 ఎన్నికల తర్వాత 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అప్పటి అధికార టీడీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీని వీడి అధికార వైసీపీకి దగ్గరయ్యారు. అందుకే ఈసారి ఖచ్చితంగా నమ్మకమైన నేతలకు టిక్కెట్ ఇవ్వాలన్నది ఇద్దరు అధినేతల నిర్ణయం.

సీనియర్లను....
పార్టీలు మారుతున్న వారికి ఈసారి టిక్కెట్లు దక్కే అవకాశం లేదంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఈసారి సీనియర్లను సయితం పక్కన పెట్టాలని నిర్ణయించారు. పార్టీ కోసం కష్టపడే వారికే టిక్కెట్లు అని, చివరి నిమిషంలో హడావిడి చేసే వారికి నో ఛాన్స్ అంటూ చెప్పకనే చెప్పేశారు. ఇలా టిక్కెట్లు ఈసారి దక్కని వారిలో కొండ్రు మురళి ఒకరంటున్నారు. ఆయన 2014 ఎన్నికలకు ముందు పార్టీలో చేరారు.
పార్టీలో యాక్టివ్ గా లేక...
పైగా గత కొంతకాలంగా పార్టీలో యాక్టివ్ గా లేరు. వ్యక్తిగత కారణాలు కావచ్చు. పార్టీ నేతలు సహకరించడం లేకపోవడం కావచ్చు. ఆయన పార్టీ కార్యక్రమాలను పెద్దగా చేపట్టడం లేదు. పార్టీ ఇన్ ఛార్జిగా రాజాం నియోజకవర్గంలో ఉన్నా ఆయన పెద్దగా కన్పించడం లేదు. పైగా మూడు రాజధానుల అంశానికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు కొండ్రు మురళి. అందుకు ప్రధాన కారణం ఇక్కడ పార్టీలో ఉన్న గ్రూపులే. ఇక్కడ మాజీ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ తనకంటూ ఒక సొంత గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు.
గ్రీష్మకే ఛాన్స్.....
గత ఎన్నికల్లోనే తనకు టిక్కెట్ రావాల్సి ఉందని, కొండ్రు కారణంా రాలేదని అభిప్రాయపడుతున్నారు. గ్రీష్మకు చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అందుకే గ్రీష్మ యాక్టివ్ అయ్యారని చెబుతున్నారు. కొండ్రు మురళిది పార్టీ మారే మనస్తత్వమని, ప్రతిభా భారతి కుటుంబం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉందని, అందుకే నమ్మకానికే ప్రాధాన్యత ఇవ్వాలన్నది చంద్రబాబు నిర్ణయంగా తెలుస్తోంది. కొండ్రు మురళిని ఈసారి పక్కన పెట్టడం ఖాయమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక రాజాంలో గ్రూపుల గోల తట్టుకోలేక కొండ్రు కూడా తన దారి తాను చూసుకోక తప్పదు.


Tags:    

Similar News