ఈ యుద్ధంలో వంద సీట్లు ఖాయం

Update: 2018-11-14 06:56 GMT

కోనాయిపల్లి వెంకన్న దీవెనలతో, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో యుద్ధానికి పోతున్నానని, ఈ రాజకీయ యుద్ధంలో వంద సీట్లు గెలుచుకుని వస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కోనాయిపల్లి వెంకన్న స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడారు. కోనియాపల్లిలో పూజలు చేసి వెళ్లాక తనకు ఇంతవరకూ ఓటమి తెలియదని పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ గా ఈ ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. దేశంలో రైతులు, దళిత, గిరిజనులు అన్నిరకాలుగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందన్నారు. దేశంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు.

హరీష్ రావుకు లక్ష మెజారిటీ ఇవ్వండి

ప్రతీ రైతుకు అప్పులు తీరి బ్యాంకులో రూ.10 లక్షలు ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమైనట్లని పేర్కొన్నారు. దేశంలో ధనికులైన రైతులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణలో అని చెప్పే విధంగా అభివృద్ధి చెందాలన్నారు. వచ్చే సంవత్సరానికి కాళేశ్వరం నీళ్లు సిద్ధపేటకు తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం చేస్తామని పేర్కొన్నారు. త్వరలో సిద్ధిపేటకు రైతుకూత కూడా వస్తుందని హామీ ఇచ్చారు. కచ్చితంగా 100 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హరీష్ రావును సిద్ధిపేట నుంచి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

Similar News