ఏంది బాసూ.. ఈ బాదుడేంది?

భారత్ - న్యూజిలాండ్ మధ్య మూడో వన్డేలో భారత్ బ్యాటర్లు విజృంభించి ఆడుతున్నారు ఓపెనర్లిద్దరూ సెంచరీలు చేశారు.

Update: 2023-01-24 09:56 GMT

భారత్ - న్యూజిలాండ్ మధ్య మూడో వన్డేలో భారత్ బ్యాటర్లు విజృంభించి ఆడుతున్నారు. ఓపెనర్లిద్దరూ సెంచరీలు చేశారు.. ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, శుభమన్ గిల్ లు క్రీజుకు అతుక్కుపోయి ఉన్నారు. రోహిత్ 83 బాల్స్ లో 100 పరుగులు చేయగా, శుభమన్ గిల్ 72 బాల్స్ లో 100 పరుగులు చేశారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు అనువైన పిచ్ కావడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తుంది. ఇద్దరూ సెంచరీలకు చేరువగా ఉన్నారు.

ఓపెనర్ లిద్దరూ...
ఓపెనర్లిద్దరూ న్యూజిలాండ్ బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. స్పిన్ లేదు.. పేస్ లేదు.. అందరినీ బాదేశారు. 26 ఓవర్లకు 212 పరుగులు చేసిందంటే భారత్ ఈ మ్యాచ్ లో ఏ మేరకు రాణించిందో ఇట్టే అర్థమవుతుంది. పదే పదే బౌలర్లను మార్చినా ఫలితం కన్పించడం లేదు. రిస్కీ షాట్లను కూడా కొడుతూ బాల్ ను బౌండరీ వైపు పరుగులు తీయిస్తున్నారు. దీంతో భారత్ ఈ మ్యాచ్ లో 400 పరుగులకుపైగానే చేసే అవకాశముంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ అతి పెద్ద భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సెంచరీ పూర్తయిన వెంటనే రోహిత్ శర్మ అవుటయ్యాడు.


Tags:    

Similar News