భారీ వర్షం… వణికిపోయిన నగరం

హైదరాబాద్ లో కుండపోత వర్షం జనజీవనాన్ని అతలాకుతం చేసింది. దాదాపు 32 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత వందేళ్లలో ఇంతటి వర్షపాతం నమోదుకావడం ఇది రెండోసారి అని [more]

Update: 2020-10-14 02:44 GMT

హైదరాబాద్ లో కుండపోత వర్షం జనజీవనాన్ని అతలాకుతం చేసింది. దాదాపు 32 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత వందేళ్లలో ఇంతటి వర్షపాతం నమోదుకావడం ఇది రెండోసారి అని అంటున్నారు. భారీ వర్షాలకు పది మంది వరకూ చనిపోయారు. శిధిలావస్థకు చేరుకున్న ఇళ్లు అనేకం కూలిపోయాయి. దీంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. గత 48 గంటల నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయంగా మారిపోయాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ ల్లోని పలు బస్తీలు నీట మునిగాయి. ఇక జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో విజయవాడ – హైదరాబాద్ మధ్య రాకపోకలు స్థంభించిపోయాయి. నిన్నటి నుంచే వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఇళ్లను వదిలి ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు.

Tags:    

Similar News