భగ్గుమన్న బంగారం, వెండి

బుధవారం బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర 350 రూపాయల పెరిగి, 57,750 కి చేరింది. ఈ నెలలో ఇదే ఎక్కువ ధర కావడం గమనార్హం. 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 380 రూపాయలు పెరిగి 63,000 కి చేరింది.

Update: 2023-12-21 01:58 GMT

gold price today

బుధవారం బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర 350 రూపాయల పెరిగి, 57,750 కి చేరింది. ఈ నెలలో ఇదే ఎక్కువ ధర కావడం గమనార్హం. 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 380 రూపాయలు పెరిగి 63,000 కి చేరింది. అమెరికాలో ఫెడ్‌ రేట్ల ప్రభావం బుధవారం బంగారం, వెండిపై పడిరది. స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాట నడవడంతో, మదుపరులు బంగారం కొనుగోలు వైపు మొగ్గు చూపారు.

వెండి రేట్లు కూడా బుధవారం భారీగానే పెరిగాయి. కిలో వెండి ధరలో 700 రూపాయల పెరుగుదల కనిపించింది. మంగళవారం 500 రూపాయలు తగ్గడం గమనార్హం. బుధవారం నాటికి హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో కిలో వెండి 80,200కు చేరింది. ఈ నెలలో డిసెంబర్‌ 15న కూడా వెండి ధర భారీగా పెరిగి కిలో 80,500 రూపాయలకు చేరిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News