బడ్జెట్ 2022-23 : టూ వీలర్స్ ధరలు తగ్గనున్నాయా ?

తొలి విడతలోనే.. ఫిబ్రవరి1వ తేదీ ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుండగా.. ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతోందోనని

Update: 2022-01-29 06:55 GMT

దేశంలో కరోనా సంక్షోభం మొదలయ్యాక.. కేంద్రం ప్రవేశపెడుతున్న రెండవ యూనియన్ బడ్జెట్ ఇది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే 2022-23 బడ్జెట్ పై దేశమంతా భారీ అంచనాలు పెట్టుకుంది. ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్ లో కేంద్రం ఏయే రంగాలకు పెద్దపీట వేసింది ? ఏయే రంగాలకు అనుకూలంగా బడ్జెట్ ఉండనుంది ? అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనవరి 31వ తేదీ నుంచే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతుండగా.. రెండు విడతలుగా సమావేశాలు జరగనున్నాయి.

తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి11వ తేదీతో ముగియనున్నాయి. రెండో విడత సమావేశాలు మార్చి 11వ తేదీన మొదలై.. ఏప్రిల్ 8వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. తొలి విడతలోనే.. ఫిబ్రవరి1వ తేదీ ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుండగా.. ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతోందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈసారి బడ్దెట్ లో కేంద్రం ఆర్థిక రంగాన్ని పైకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. మరోవైపు రైతన్నలు రుణమాఫీలపై గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. సామాన్యులు సైతం.. కరోనా సంక్షోభంలో కేంద్రం నుంచి ఏదైనా శుభవార్త రావొచ్చని ఆశిస్తున్నారు.
ఈ ఏడాది బడ్జెట్ లో కేంద్రం ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ డిమాండ్లను అంగీకరించినట్లైతే.. టూవీలర్ల ధరలు తగ్గవచ్చని తెలుస్తోంది. టూ వీలర్స్ విలాసవంతమైన ఉత్పత్తి కాదు కాబట్టి.. వాటిపై ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటే.. టూవీలర్ల ధరలు భారీగా దిగివచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.





Tags:    

Similar News