ఛాలెంజ్ చేస్తారు.. ఆ పై మోసం చేస్తారు….సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఛాలెంజ్ ల పేరిట హోరెత్తిస్తున్నారు. ఎవరో విసిరిన ఛాలెంజ్ చూసి మనం రియాక్ట్ అయితే బుట్టలో పడినట్టే. మనకు తెలియకుండానే [more]

Update: 2020-09-30 03:38 GMT

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఛాలెంజ్ ల పేరిట హోరెత్తిస్తున్నారు. ఎవరో విసిరిన ఛాలెంజ్ చూసి మనం రియాక్ట్ అయితే బుట్టలో పడినట్టే. మనకు తెలియకుండానే మన సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు దొంగిలిస్తున్నారు. మన ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు.. ఇప్పుడు చాలెంజ్ ల పేరుతో వస్తున్న వాటికి రియాక్ట్ అయితే మీ పని గోవిందా అని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. పాడు పనులు చేసే వెబ్ సైట్లు కూడా మన ఫోటోలు ప్రత్యక్షమవుతున్నాయి.

ఛాలెంజ్ ల పేరిట…

ఇటీవల కాలంలో ఎవరు పడితే వాళ్ళు చాలెంజ్ విసురుతున్నారు.. ఒకరు రైస్ ఛాలెంజ్ అంటే.. మరొకరు డాటర్ ఛాలెంజ్ అంటున్నారు. మరొకడు లవర్ చాలెంజ్ అంటూ సవాలు వేస్తున్నారు .. ఇప్పుడు ఎక్కడ చూసినా ఛాలెంజ్ లో పెరు తో సోషల్ మీడియాలో కనబడుతుంది. ఛాలెంజ్ పేరుతోటి ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. ఇలా పోస్ట్ చేసిన ఫోటోలు ఎక్కడికి వెళ్తున్నాయో.. తెలుసా.. తెలిస్తే మీరు మరొకసారి ఫోటోలని అసలు సోషల్ మీడియాలో పెట్టరు. ఎందుకంటే మీ ఫోటోలను తీసుకొని సైబర్ నేరగాళ్లు సొమ్ముచేసుకుంటున్నారు.. అంతేకాదు పాడు పనులు చేసే వెబ్ సైట్ లో కూడా మన ఫోటోలను మార్పింగ్ చేసి పెడుతున్నారు.. ఫోటోలు తొలగించాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి చాలెంజ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News