ఆ యాంటాసిడ్ సిరప్ వాడొద్దు..!

అబాట్‌ ఇండియా ఫార్మా కంపెనీ తయారు చేసిన యాంటీసిడ్‌ సిరప్‌ ‘డైజీన్‌ జెల్‌’ అనే మందును వాడొద్దని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) సూచించింది. దేశంలోని అత్యున్నత మందుల నియంత్రణ యంత్రాంగం... డైజీన్‌ వాడకంపై తన వెబ్‌సైట్‌లో ఓ హెచ్చరిక జారీ చేసింది. ‘డైజీన్‌ వాడకం వల్ల దుష్పరిణామాలు తలెత్తవచ్చు’, అంటూ దీనిని వాడొద్దని రోగులకు సూచించింది. అలాగే ఈ మందును కొనసాగించవద్దని డాక్టర్లు, ఇతర వైద్య రంగ నిపుణులకు ఆదేశాలు జారీ చేసింది.

Update: 2023-09-07 03:06 GMT

డైజీన్‌ జెల్‌ యాంటీసిడ్‌పై డీజీసీఐ హెచ్చరిక జారీ

అబాట్‌ ఇండియా ఫార్మా కంపెనీ తయారు చేసిన యాంటీసిడ్‌ సిరప్‌ ‘డైజీన్‌ జెల్‌’ అనే మందును వాడొద్దని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) సూచించింది. దేశంలోని అత్యున్నత మందుల నియంత్రణ యంత్రాంగం... డైజీన్‌ వాడకంపై తన వెబ్‌సైట్‌లో ఓ హెచ్చరిక జారీ చేసింది. ‘డైజీన్‌ వాడకం వల్ల దుష్పరిణామాలు తలెత్తవచ్చు’, అంటూ దీనిని వాడొద్దని రోగులకు సూచించింది. అలాగే ఈ మందును కొనసాగించవద్దని డాక్టర్లు, ఇతర వైద్య రంగ నిపుణులకు ఆదేశాలు జారీ చేసింది.

‘ఈ మందు ఇప్పటికే వాడుతున్న వారు.. తమకు ఎలాంటి సమస్యలు ఎదురైనా, డ్రగ్స్‌ నియంత్రణ మండలి దృష్టికి తీసుకురావాలని డీసీజీఐ సూచించింది. ‘మందు చేదుగా ఉండటం, దుర్వాసన రావడం వల్ల అబాట్‌ ఫార్మా... మింట్‌ ఫ్లేవర్‌లో ఉండే ఒక బ్యాచ్‌, ఆరెంజ్‌ ఫ్లేవర్‌లో ఉండే నాలుగు బ్యాచ్‌ల ‘డైజీన్‌’ను ఉపసంహరించుకుంది. వారం రోజుల్లో ఆ కంపెనీ మిగిలిన అన్ని బ్యాచ్‌ల మందులను కూడా వెనక్కి తీసుకుంది’ అని డీజీసీఐ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

తన సిరప్‌పై వచ్చిన ఫిర్యాదులతో అబాట్‌ ఫార్మా స్వచ్ఛందంగానే ప్రొడక్ట్‌ని వెనక్కి తీసుకుందని, ఈ విషయాన్ని డీజీసీఐకి తెలియజేసిందని ఆ కంపెనీ ప్రతినిధి వెల్లడిరచారు. తన గోవా సైట్‌లో తయారయ్యే ఈ సిరప్‌ విషయంలో... టేస్ట్‌, వాసన విషయంలో ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ ఎవరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలూ తలెత్తలేదని ఆ ప్రతినిధి పేర్కొన్నారు. వేరే ప్రాంతం(బడ్డి)లో తయారవుతున్న తమ డైజీన్‌ జెల్‌ వల్ల ఎలాంటి సమస్యలూ లేవని వివరించారు.

Tags:    

Similar News