కత్తి మహేష్, ఛానళ్లకు డీజీపీ సీరియస్ వార్నింగ్

Update: 2018-07-09 08:14 GMT

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో అశాంతికి కారణమవుతున్న సినీ విమర్శకుడు కత్తి మహేష్, అతడి వ్యాఖ్యలను పదేపదే ప్రచారం చేస్తున్న టీవీ ఛానళ్లకి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...కొందరు సమాజంలో శాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు, మెజార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై ఆరునెలల పాటు నగర బహిష్కరణ విధించామని, ఒకవేళ ఆయన నగరంలో అడుగుపెడితే మూడేళ్ల శిక్ష పడే నేరం అవుతుందని స్పష్టం చేశారు. ఆయనను అరెస్ట్ చేసి చిత్తూరు జిల్లాకు తరలించినట్లు తెలిపారు. వివాదాస్పద వ్యక్తులకు సహకరించే వారిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రోగ్రాం కోడ్ ను అతిక్రమించి ప్రచారం చేసిన ఓ టీవీ ఛానల్ కు నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. కేబుల్ టీవీ చట్టాలను ఉల్లంఘించే ఛానళ్ల యాజమానులకు రెండేళ్ల శిక్ష పడుతుందని హెచ్చరించారు. కత్తి మహేష్ సోషల్ మీడియాలో కూడా పోస్టింగ్ లు పెట్టవద్దని స్పష్టం చేశారు.

Similar News