ఆయన రాజీనామా చేయాల్సిందే.. ఫడ్నవిస్ డిమాండ్

మహారాష్ట్ర పరిణామాలపై సీబీఐతో విచారణ జరపాలని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖను కలిసి కీలక సమాచారాన్ని ఫడ్నవిస్ అందించారు. హోంశాఖమంత్రి అనిల్ [more]

Update: 2021-03-24 01:12 GMT

మహారాష్ట్ర పరిణామాలపై సీబీఐతో విచారణ జరపాలని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖను కలిసి కీలక సమాచారాన్ని ఫడ్నవిస్ అందించారు. హోంశాఖమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ను కాపాడేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. త్వరలోనే అన్ని గుట్టులను బయటపెడతానని ఆయన హెచ్చరించారు. పోలీసు అధికారుల బదిలీల విషయంలో పెద్దయెత్తున అవినీతి జరిగిందని ఫడ్నవిస్ ఆరోపించారు. దేశ్ ముఖ్ ను హోంమంత్రి పదవి నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News