కూతురుపైనే వడ్డీ వేదింపులు

Update: 2018-07-17 09:56 GMT

ఓ వడ్డీ వ్యాపారి ధనదాహంతో స్వంత కూతురుపైనే వేదింపులకు గురిచేస్తున్నాడు. కృష్ణ జిల్లా గంపలగూడెం సమీపంలోని తునికిపాడుకి చెందిన కిలారు హన్మంతరావు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సైడ్ బిజినెస్ గా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. అయితే, స్థలం కొనుక్కోవడానికి కూతురు చంద్రలేఖ తండ్రి వద్ద రూ.5 లక్షలు తీసుకుంది. మొదట కానుకగా ఇస్తున్నానని చెప్పిన తండ్రి తర్వాత వడ్డీ చెల్లించాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఇప్పటికే కూతురు రూ.13 లక్షలు చెల్లించారు. అయితే, ఆశ చావని హన్మంతరావు ఇంకా రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కూతురికి ఉన్న భూమిలో వ్యవసాయం చేయకుండా కౌలుదారును అడ్డుకున్నాడు. దీంతో ఇంకా వేదింపులు భరించలేని చంద్రలేఖ తండ్రి హన్మంతరావుపై కృష్ణ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. దీంతో అధిక వడ్డీ వసూలు చేస్తున్న హన్మంతరావుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పోలీసులను ఆదేశించారు.

Similar News