అక్కడ పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించారు

ఛత్తీస్ ఘడ్ లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఈ రాష్ట్ర సరిహద్దులను కూడా కొన్ని రాష్ట్రాలు మూసివేశాయి. ఛత్తీస్ ఘడ్ నుంచి రావాలంటే [more]

Update: 2021-04-13 01:23 GMT

ఛత్తీస్ ఘడ్ లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఈ రాష్ట్ర సరిహద్దులను కూడా కొన్ని రాష్ట్రాలు మూసివేశాయి. ఛత్తీస్ ఘడ్ నుంచి రావాలంటే పరీక్షలు చేయించుకుని నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే అనుమతి ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న 18 జిల్లాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అధికారులు విధించారు. ఉదయం 6గంటల నుంచి 11 గంట వరకే నిత్యావసరాల కొనుగోళ్లకు అనుమతిస్తున్నారు. కంటెన్మైంట్ జోన్లలో ఇంటికే నిత్యావసర వస్తువుల ను పంపుతున్నారు.

Tags:    

Similar News