Bird Flu : చికెన్ తిన్నారో ఇక అంతే... ఏపీ నుంచి తెలంగాణకు నిషేధం
రెండు తెలుగు రాష్ట్రాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకింది. ఇప్పటికే లక్షలాది కోళ్లు బర్డ్ ఫ్లూతో మరణించాయి
రెండు తెలుగు రాష్ట్రాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకింది. ఇప్పటికే లక్షలాది కోళ్లు బర్డ్ ఫ్లూతో మరణించాయి. అనేక కోళ్ల ఫారాలు మూసివేయించారు. ఏపీ నుంచి తెలంగాణకు కోళ్లు రాకుండా నిషేధం విధించారు. అనేక ప్రాంతాల్లో రెడ్ జోన్ లను ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల పాటు చికెన్ తినడం కాని, గుడ్లు తినడం కాని చేయవద్దంటూ వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల విషపూరితంగా మారి ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని రోజుల పాటు చికెన్ తో పాటు గుడ్లు తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
చికెన్ అమ్మకాల నిలిపివేత...
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలను నిలిపివేశారు. పలు ప్రాంతాలను రెడ్ జోన్ లుగా ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ బర్డ్ ఫ్లూ సోకింది. వలస పక్షుల కారణంగానే బర్డ్ ఫ్లూ సోకిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు మధ్యాహ్నం ఇచ్చే భోజనంలోనూ కోడి గుడ్డుపై ఏపీలో నిషేధం విధించారు. కోళ్ల ఫారాలు దాదాపు మూసివేశారు. పౌల్ట్రీలను పూర్తిగా ఖాళీ చేయించారు. అదేసమయంలో చనిపోయిన కోళ్లను నీటిలో పడవేయద్దని సూచిస్తున్నారు.
వలస పక్షుల వల్లనేనా?
కొల్లేరు ప్రాంతానికి వచ్చిన వలస పక్షుల ఆధారంగానే ఈ బర్డ్ ఫ్లో సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నా అది అధికారికంగా నిర్ధారణకు రాలేదు. అదే సమయంలో కొందరు బర్డ్ ఫ్లూ తో చనిపోయిన కోళ్లను బయటపడేస్తున్నారని, వాటిని భూమిలో పూడ్చి పెట్టేయాలని అధికారులు చెబుతున్నారు. చికెన్ అమ్మకాలు చేస్తే చర్యలు తప్పవని, భారీ జరిమానాలు విధిస్తామని మున్సిపల్ అధికారులు చాటింపు వేయిస్తున్నారు. వైరస్ వేగంగా విస్తరిస్తుందని చెబుతున్నారు. చికెన్ అమ్మకాలు పడిపోవడంతో దాని ధరలు కూడా గణనీయంగా పడిపోయాయి.