నేను సాక్ష్యాలిస్తే విచారణ చేస్తారట… పోలీసులు ఉంది ఎందుకు?

ఏపీ డీజీపీ తనకు లేఖ రాయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను ఆధారాలు అడుగుతున్నారని, పోలీసులు ఎందుకు ఉన్నారని చంద్రబాబు ప్రశ్నించారు. సాక్ష్యాలను [more]

Update: 2020-09-30 03:00 GMT

ఏపీ డీజీపీ తనకు లేఖ రాయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను ఆధారాలు అడుగుతున్నారని, పోలీసులు ఎందుకు ఉన్నారని చంద్రబాబు ప్రశ్నించారు. సాక్ష్యాలను తాను పంపితే వీళ్లు ఇక దర్యాప్తు చేసేదేముంటుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. దర్యాప్తు బాధ్యత పోలీసులదా? ప్రతిపక్షానిదా? అని చంద్రబాబు నిలదీశారు. జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి చేసిన వారు తొలుత కుమార్ రెడ్డి అని చెప్పారని, తర్వాత పేర్లు కూడా మార్చేశారని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఆశలేదన్నారు. దళితులపై వరసగా జరుగుతున్న దాడులను చంద్రబాబు ఖండించారు.

Tags:    

Similar News