ఎమ్మెల్యే, ఎంపీల గుట్టు రట్టు

ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మరో బాంబు పేల్చింది. గతంలో నయింతో అంటకాగిన నేతలు, పోలీసుల బాసుల గుట్టు రట్టు చేసిన ఫోరమ్ మరో లిస్టు సేకరించింది. [more]

Update: 2019-09-20 02:43 GMT

ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మరో బాంబు పేల్చింది. గతంలో నయింతో అంటకాగిన నేతలు, పోలీసుల బాసుల గుట్టు రట్టు చేసిన ఫోరమ్ మరో లిస్టు సేకరించింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టుతో మన నేతల కేసుల చిట్టా సేకరించి మరోసారి సంచలనానికి కేరాఫ్ అయ్యింది. ఏ ప్రజాప్రతినిధులపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసుకున్న ఫోరమ్ వాటిని త్వరితగతిన పూర్తి చేయాలంటూ గవర్నర్ ను కోరింది.

ఎన్ని కేసులు…?

ఎన్నికలు వస్తే ప్రజా ప్రతినిథుల ఆస్తులు గుర్తుకు వస్తాయి. వారి సంపాదించినది ఎంత ? దాచినసొత్తు ఎంత అంటూ ప్రత్యర్థులు లెక్కలు కడతారు. ఎన్నికల సమయంలో గుర్తుకు రాని కొన్ని విషయాలు మాత్రం అలా చప్పుడు కాకుండా మరుగున పడిపోతాయి. వాటి విషయానికి వస్తే ఏళ్లు గడిచినా పట్టించుకునే వారే ఉండరు. అవే మన నేతలపై కేసులు. నాన్ బెయిలబుల్ కేసులు పెండింగ్ లో ఉన్నా, చార్జీషీట్ దాఖలు చేయాల్సి ఉన్నా పోలీసులకు ఏ మాత్రం పట్టదు. అందుకే ఈ తంతంగాన్ని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ బయటపెట్టింది. ప్రజాప్రతినిథుల కేసు చిట్టా సేకరించి వాటిని త్వరితగతిని పూర్తి చేయాలంటూ గవర్నర్ కి లేఖ రాసింది. ఇటీవల నయిం కేసులో ఉన్న ప్రజాప్రతినిధులు, పోలీసు బాస్ లకు ఉన్న సంబంధాలను సేకరించి సంచలనానికి కేరాఫ్ అడ్రస్సుగా మారిన ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తాజాగా ఎంపి, ఎమ్మెల్యేల నేర చరిత్ర సంపాదించింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు ప్రకారం ఒక్కో నేతపై ఎన్ని కేసులు ఉన్నాయి. వాటి వివరాలు ఏంటీ, ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయో లిస్టు సేకరించింది. అలా సేకరించిన లిస్టులో ఎవరెవరిపై ఎన్నిఉన్నాయో లెక్క కట్టింది. తెలంగాణ ఉద్యమ కేసుల కొట్టివేత తర్వాత 2014 నుండి 2019 వరకు నమోదైన కేసులు తెలుసుకుంది.

త్వరిత గతిన పూర్తి చేయాలంటూ….

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధుల కేసుల్లో మొట్టమొదటి స్థానంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. ఆయనపై ఇప్పటి వరకు 17 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అలాగే రేవంత్ రెడ్డిపై 7 కేసులు, అక్బరుద్దీన్ పై ఆరు కేసులు, జగ్గారెడ్డి పై 5 కేసులు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, వినయ్ భాస్కర్ , సంపత్ కుమార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జూపల్లి కృష్ణారావు, సాయన్న, కాశిపేట లింగయ్య ఒక్కొక్కరిపై మూడు కేసులు నమోదై ఉండగా తాటికొండ రాజయ్య పై అయిదు కేసులు ఉన్నాయి.ఇలా అసదుద్దన్ ఒవైసీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కూడా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే, ఎంపిల కేసుల విచారణకు తెలంగాణలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. వాటన్నింటిని త్వరితగతిన పూర్తి చేయాలని లిస్టు సేకరించిన ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ రెడ్డి గవర్నర్ కి లేఖ రాశారు.

Tags:    

Similar News