అమరావతి విడిచి వెళ్లకూడదని?

ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ ని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత ప్రభుత్వం లో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవో గా కృష్ణ [more]

Update: 2019-12-13 01:45 GMT

ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ ని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత ప్రభుత్వం లో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవో గా కృష్ణ కిషోర్ పనిచేశారు. కృష్ణ కిశోర్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. పరిశ్రమలు,మౌలిక వసతుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. కృష్ణ కిషోర్ పై కేసు నమోదు చేయాలని సీఐడీ, ఏసీబీ డీజీ లకు ఆదేశాలు వెళ్లాయి. ఆయన అధికారిగా ఉన్న సమయంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని సీఐడీ, ఏసీబీ డీజీ లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యేవరకూ అమరావతి విడిచి వెళ్లకూడదని కృష్ణ కిషోర్ ను ప్రభుత్వం ఆదేశించింది.

Tags:    

Similar News