ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణ
గత తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం విచారణ ఉత్తర్వులు జారీ [more]
గత తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం విచారణ ఉత్తర్వులు జారీ [more]
గత తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం విచారణ ఉత్తర్వులు జారీ చేసింది. ఫైబర్ నెట్ టెండర్ల ఖరారులో కాంట్రాక్టర్లకు అనుకూలంగా గత ప్రభుత్వం వ్యవహరించినట్లు వైసీపీ నేతలు గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాత్ర ఉన్నట్లు కూడా ఆరోపణలున్నాయి. దీనిపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించడంతో లోకేష్ లక్ష్యంగా ప్రభుత్వం విచారణకు ఆదేశించిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.