టీడీపీకి మరో సీనియర్ నేత గుడ్ బై

తెలుగుదేశం పార్టీకి మరో సీనియర్ నేత రాజీనామా చేశారు. టీడీపీ సీనియర్ నేత గద్దె బాబూరావు పార్టీకి రాజీనామా చేశారు. తనను పదిహేనేళ్లుగా పార్టీ పట్టించుకోవడం లేదని, [more]

Update: 2020-09-27 06:24 GMT

తెలుగుదేశం పార్టీకి మరో సీనియర్ నేత రాజీనామా చేశారు. టీడీపీ సీనియర్ నేత గద్దె బాబూరావు పార్టీకి రాజీనామా చేశారు. తనను పదిహేనేళ్లుగా పార్టీ పట్టించుకోవడం లేదని, అయినా తాను పార్టీ కోసం పనిచేశానని గద్దె బాబూరావు తెలిపారు. తనకిక టీడీపీలో భవిష్యత్ లేదని తెలిసి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి గద్దె బాబూరావు టీడీపీలో ఉన్నారు. గతంలో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి గద్దె బాబూరావు ఎమ్మెల్యేగా గెలిచారు.

Tags:    

Similar News