ఆరోజు నారాయణ జాబ్ ఇచ్చి ఉంటే?

అనిల్ కుమార్ యాదవ్. ఏపీ ఇరిగేషన్ మంత్రి. ఆయన వాస్తవానికి దంత వైద్యుడు. రాజకీయాల్లోకి రావడం కూడా ఇష్టంలేదు. మాజీ మంత్రి నారాయణ విద్యాసంస్థల్లో ఉద్యోగం కోసం [more]

Update: 2019-11-11 04:15 GMT

అనిల్ కుమార్ యాదవ్. ఏపీ ఇరిగేషన్ మంత్రి. ఆయన వాస్తవానికి దంత వైద్యుడు. రాజకీయాల్లోకి రావడం కూడా ఇష్టంలేదు. మాజీ మంత్రి నారాయణ విద్యాసంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించారు. నారాయణను కూడా కలసి తనకు ఉద్యోగం ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే నారాయణ అనిల్ కుమార్ యాదవ్ కు ఉద్యోగం ఇవ్వలేదు. తర్వాత తన తండ్రి మరణంతో అనిల్ కుమార్ యాదవ్ రాజకీయాల్లోకి వచ్చారు. అదే నారాయణ మీద మొన్నటి ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి సాధించారు. ఇది ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. నిజంగా నాడు నారాయణ అనిల్ కుమార్ కు ఉద్యోగం ఇచ్చి ఉంటే అనిల్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చే వారు కాదన్న మాట.

Tags:    

Similar News