ఉగాది నాటికి పూర్తి.. కొత్త జిల్లాల నోటిఫికేషన్?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు

Update: 2022-01-25 01:52 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈరోజు, రేపు దీనిపై నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఉగాది నాటికి కొత్త జిల్లాల ప్రక్రియను పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు జగన్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కమిటీ నివేదిక కూడా ఇవ్వడంతో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.

పాదయాత్రలో....
జగన్ 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలున్నాయి. వాటితో పాటు మరో పదమూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు. అంటే ఏపీలో మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేయాలని దాదాపుగా నిర్ణయించారు. సుదీర్ఘ కసరత్తు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
అరకు ప్రాంతాన్ని....
అతి పెద్దదిగా ఉన్న అరకు ప్రాంతాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. రెండు గిరిజన జిల్లాలను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్ గా అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అక్కడ అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలను కల్పిస్తే వివిధ రంగాల్లో అభివృద్ధి దానంతట అదే జరుగుతుందని భావిస్తున్నారు.
ఈరోజు, రేపులో....
ఈ నేపథ్యంలో ఈరోజు కాని రేపు కాని కొత్త జిల్లాలపై ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి. కొత్త జిల్లాల్లోనూ ఇప్పటికే జగన్ ప్రభుత్వం మెడికల్ కళాశాలలను కూడా ప్రారంభించేందుకు సిద్దమయింది. ఈ నేపథ్యంలో వచ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాల ప్రక్రియను పూర్తి చేయాలన్నది జగన్ ప్రభుత్వం ఆలోచనగా ఉంది. జిల్లా కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో కూడా గుర్తించారు. మొత్తం మీద ఏపీలో మరో 13 కొత్త జిల్లాలు నేడో, మాపో రాబోతున్నాయి.


Tags:    

Similar News